Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మోహన్ మౌనం వీడాలి.. అవినీతి న్యాయమూర్తి అంశంపై..?: వెంకయ్య

Webdunia
గురువారం, 24 జులై 2014 (12:02 IST)
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక న్యాయమూర్తిని మద్రాసు హైకోర్టు జడ్జీగా నియమించారంటూ మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ చేసిన ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనం వీడాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... అవినీతి జడ్జి పదవీ కాలాన్ని పొడిగించేందుకు యూపీఏ హయాంలో ప్రయత్నించారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని కోరారు. దానిపై నిర్ధిష్టమైన ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. 
 
ఈ విషయన్నంతటినీ ముందుగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ వెల్లడించారన్నారు. యూపీఏ హయాంలో ప్రభుత్వం ఎలా పనిచేసిందో ఈ విషయం ద్వారా తెలుస్తుందని, ప్రతి అంశంలోనూ రాజీకోసం ప్రయత్నిస్తున్నట్లు ఉందని ఆరోపించారు. కాగా, మన్మోహన్ దీనిపై నిశ్శబ్ధంగా ఉండటంవల్ల ఏదో దాస్తున్నట్లే అనిపిస్తుందని చెప్పారు.
 
అందువల్ల మాజీ పీఎం తక్షణమే సదరు అంశంలో అప్పట్లో ఏం జరిగిందో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. దానివల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట పెరిగేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. అంతేకాక మాజీ ఎంపీ ద్వారా ఎవరైనా అలాంటి తప్పుడు ప్రకటన చేయించినట్లైతే వారిని తీసివేస్తామని వెంకయ్య అన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments