Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో తొలి కరోనా మరణం.. తడలో ఒకే ఫ్యామిలీలో 4 పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (09:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. అలాగే, ఇదే జిల్లాలోని తడలో ఒకే కుటుంబంలోని నలుగురికి ఈ వైరస్ సోకినట్టు తాజాగా తేలింది. మరోవైపు, జిల్లా వ్యాప్తంగా మొత్తం నమోదైన పాజిటివ్ కేసులు 56గా ఉన్నాయి 
 
కాగా, ఇటీవల కరోనా సోకిన జిల్లా కేంద్రానికి చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడిని చికిత్స నిమిత్తం చెన్నై ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఆయన అంత్యక్రియలు కూడా చెన్నైలోనే నిర్వహించగా, వాటికి కూడా ఆయన కుటుంబ సభ్యులు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. 
 
మరోవైపు ఆయన భార్య, ఫార్మాసిస్ట్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 
 
ఇకోవైపు, కరోనా పరీక్షల ఫలితాలు వెల్లడించడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సరైన వివరాలు లేకుండానే నమూనాలను సేకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 
 
దీంతో ఒకసారి పాజిటివ్‌‌గా మరోసారి నెగిటివ్ అంటూ అందరినీ తికమకకు గురిచేస్తున్నారు. వైద్యఆరోగ్య శాఖ నిర్లక్ష్య పూరిత వ్యవహారంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments