Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలి బాధలు తీరుస్తున్న నాట్స్, గుంటూరులో నిరుపేదలకు 3 రోజుల పాటు ఆహార పంపిణి

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (18:54 IST)
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా కరోనా నియంత్రణకు పెట్టిన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేసేందుకు నాట్స్ ముందుకొచ్చింది. గుంటూరు నగరం పూర్తిగా రెడ్ జోన్‌లో ఉండటంతో ఇక్కడ శివారు ప్రాంతాల్లోని నిరుపేదలకు ఆకలిబాధలు తప్పడం లేదు. 
 
ఈ విషయాన్ని స్థానికంగా ఉండే కిట్స్ కాలేజీ నాట్స్ దృష్టికి తీసుకురావడంతో నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తక్షణమే స్పందించారు. గుంటూరు శివారు ప్రాంతాల్లో పేదల ఆకలిబాధలు తీర్చడానికి ఆర్థికసాయం అందించారు. కిట్స్ కాలేజీ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, రెడ్‌క్రాస్ సోసైటీ సభ్యులు, శ్రీవన అన్నదాన సంఘానికి చెందిన అనుమలశెట్టి మల్లికార్జున, చైతన్యలతో పాటు ప్రొఫెసర్ ఆతుకూరి రాఘవ, సీతారాంల సహాకారంతో నాట్స్ పేదలకు ఉచితంగా ఆహారపొట్లాలు అందించింది. 
 
ఈ కార్యక్రమం మరో రెండు రోజుల పాటు సాగనుంది. నేటి నుండి  మూడు రోజులపాటు నిరుపేద కార్మిక కాలనీ వాసులకు ఉచితంగా ఆహారపొట్లాలు అందించనుంది. త్వరలో పేదలకు మాస్కులు, శానిటైజర్లు కూడా పంపిణి చేయాలని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి భావిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఆకలిబాధలు పడుతున్న తమకు నాట్స్ చేస్తున్న సాయం మరువలేనిదని నిరుపేదలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments