Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూనిక‌లు, కొల‌త‌లశాఖ సిబ్బందికి క‌రోనా వ్యాప్తి నిరోధ‌క ర‌క్ష‌ణ క‌వ‌చాలు

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (18:58 IST)
మునుపెన్న‌డూ చూడ‌ని క‌రోనా వైర‌స్ వంటి మ‌హ‌మ్మారి విప‌త్తు కార‌ణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యం వినియోగదారులను వ్యాపారుల మోసాలు నుండి సంరక్షిస్తూ శాఖాప‌రంగా అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌ని తూనిక‌లు, కొల‌త‌ల శాఖ ఐజి డాక్టర్ ఎం.కాంతారావు ప్రశంసించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు మరింత చేరువలో పని చేసేందుకుగాను ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన స్వీయ సంరక్షణ మరియు భౌతిక దూరం, సాంఘిక సంరక్షణపై అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు. ప్రజల‌తో పాటు అనాధలు, అభాగ్యుల‌కు సహాయ సహకారాలు అందించి సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

దేశ‌వ్యాప్తంగా ర‌వాణా సేవ‌లు నిలిచిపోయిన నేప‌ధ్యంలో వ్యాపారుల మోసాలు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇటువంటి స‌మ‌యంలోనే శాఖాప‌రంగా మ‌రింత స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని ఆదేశించారు. అనంత‌రం  అధికారులు, సిబ్బందికి స్వీయ రక్షణార్థం మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

అదేవిధంగా నిత్యావ‌సర వస్తువులైన పాలు, బియ్యం, కందిపప్పు, వంట నూనెలు మరియు కూరగాయలు త‌దిత‌రాల‌పై జిల్లా కలెక్టర్ నిర్ణయించిన ధరల కన్నా అధికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులపై రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 723 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధ‌న‌లు ఉల్లంఘించిన 78 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసిన‌ట్లు తూనిక‌లు, కొల‌త‌ల శాఖ ఐజి డాక్టర్ ఎం.కాంతారావు వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments