ప్రభుత్వ స్కూల్‌లో కరోనా కలకలం: ఏపీలో కరోనా అప్డేట్

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (20:33 IST)
ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ స్కూల్‌లో కరోనా కలకలం రేపింది. వారం కిందట ఏపీలో పాఠశాలలు తెరుచుకోవటంతో చిన్నారులు బడిబాట పట్టారు. ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులకు కరోనా సోకింది. ఒంగోలు డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు..పలు పాఠశాలల్లో చికిత్స శిబిరాలను ఏర్పాటు చేశారు.
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత కిందకు దిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,678 శాంపిల్స్ పరీక్షించగా.. 1,217 మందికి పాజిటివ్‌‌గా తేలింది. మరో 13మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. 
 
ఇదే సమయంలో 1,535 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య 2,60,34,217కు పెరగగా... మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,01,255కు చేరింది. ఇప్పటి వరకు 19,72,399 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 13,715కు పెరగగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 15,141కు చేరుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments