కరోనా వైరస్ ఎఫెక్ట్‌: టీటీడీ ఉద్యోగులకు సెలవులు

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (04:54 IST)
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులకు అధికారులు సెలవులు ప్రకటించారు. 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరుకావాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

సెలవులో ఉన్న ఉద్యోగులు వచ్చేవారం విధులకు వచ్చేలా ఆదేశాలిచ్చారు. కొంతమంది ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌కు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 4 వరకు వర్తిస్తాయని టీటీడీ అధికారులు జీవో జారీ చేశారు.
 
లాక్‌డౌన్‌లో వేతనాలు చెల్లించండి
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగులను తొలగించడం గానీ, వేతనాల్లో కోత విధించడంగానీ చేయవద్దని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు సూచించవలసిందిగా కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

ముఖ్యంగా క్యాజువల్‌, కాంట్రాక్టు వర్కర్ల విషయంలో మరింత సానుకూలంగా వ్యవహరించవలసిందిగా సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు సహకరించాలని సోమవారం కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి హెచ్‌కే స్మారియా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments