గుంటూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (10:40 IST)
గుంటూరు జిల్లాలో వైల్డ్‌ టైప్‌ కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టినట్లేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. జిల్లాలో రోజూ సగటున 10 నుంచి 15 కేసులు మాత్రమే నమోదౌతున్నాయి.

ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో కొత్త కేసుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌లోపే పరిమితమై, కొంతకాలానికి కరోనా కేసులు పూర్తిగా ఆగిపోతాయని చెబుతున్నారు.

నిరుడు మార్చి నుంచి లాక్‌ డౌన్‌ ప్రకటించిన సమయం నుంచి ఆరేడు నెలల వరకు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యా యి. వీటికి వైల్డ్‌ టైప్‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌ (బాహ్య వాతావరణంలో ఉపరితలాలపై ఉండే వైరస్‌) కేసులుగా గుర్తించారు.

జిల్లాలో సుమారు 75 వేల మందికి పైగా జిల్లావాసులు కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 202 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. వీటిలో కూడా చాలామంది ఇళ్లల్లోనే హోం ఐసోలేషన్‌లో ఉండగా, కొద్ది మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు.

కాగా వైద్యాధికారుల అంచనా ప్రకారం జిల్లాలో వైల్డ్‌ టైప్‌ కరోనా వైరస్‌ బాగా తగ్గిపోయింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి డ్రాప్‌లెట్‌ ఇన్‌ఫెక్షన్‌ల రూపంలో మాత్రమే ఇతరులకు సోకుతున్నట్లు స్పష్టమౌతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments