Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు ఎవరికీ బానిసలు కారు.. రోజా క్షమాపణలు చెప్పాల్సిందే: శ్రీనివాసరావు

వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించినట్లు పోలీసులు ఎవరికీ బానిసలు కారని.. కేవలం చట్టానికి మాత్రమే బానిసలని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు డ

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (14:11 IST)
వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించినట్లు పోలీసులు ఎవరికీ బానిసలు కారని.. కేవలం చట్టానికి మాత్రమే బానిసలని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు డీజీపీ సాంబశివరావు బానిసలా వ్యవహరిస్తున్నారంటూ రోజా చేసిన వ్యాఖ్యలను శ్రీనివాసరావు ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా రోజా నోటిని అదుపులో పెట్టుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. 
 
మహిళల సదస్సును రోజా చెడగొడతారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని... అందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రోజా వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. ఎవరేం చేశారనేది తమ రికార్డ్స్‌లో ఉంటాయని.. రోజా హుందాగా వ్యవహరించాలని శ్రీనివాసరావు సూచించారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు గాను రోజా వెంటనే క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారులు డిమాండ్ చేశారు. 
 
ఇదిలా ఉంటే.. ఇటీవల మహిళా పార్లమెంటు సదస్సుకు వెళ్తున్న రోజాను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పోలీసులపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లు డీజీపీ వింటున్నారని.. పోలీసులు తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments