Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీనని కాళ్ళా వేళ్ల పడుతున్నా...వినకుండా రేప్ చేసిన పోలీస్

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (07:46 IST)
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కానిస్టేబుల్ కు తన ఎదుట ఉన్నది ఆరు నెలలో గర్భిణీ అనే మాటే గమనంలో లేదు. తన ఎదుట ఉన్నది తన కోరిక తీర్చే ఒక ఆట బొమ్మలాగే భావించాడు.. వద్దు.. వద్దు కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమని కాళ్ళా వేళ్లా పడ్డా వినిపించుకోలేదు. రెండు గంటల పాటు ఆ గర్భిణీపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు సస్పెన్షన్ కు గురై పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కృష్ణ జిల్లా ఏలూరు సమీపంలోని ఓ ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
పత్తేబాద ప్రాంతంలో ఓ మహిళ వ్యభిచార గృహం నిర్వహిస్తోందని మంగళవారం రాత్రి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. వ్యభిచార కేంద్రం నిర్వాహకురాలిని, మరో మహిళను, ఓ విటుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తనిఖీల సమయంలో వ్యభిచార కేంద్రం నిర్వాహకురాలికి వరుసకు కూతురైన 6 నెలల గర్భిణి ఆ ఇంట్లోనే వేరే గదిలో ఉంది.
 
సోదాలకు వెళ్లిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం కానిస్టేబుల్ గరికిముక్కుల రవికి ఆమెపై కన్ను పడింది. తన కోరిక తీర్చాలని ఆమెను కోరాడు. తాను గర్భిణిననే విషయం చెప్పింది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదం జరుగుతుందని, కాళ్లు పట్టుకుంటానని, తనను వదిలేయాలని వేడుకుంది. అయినా కసాయి కానిస్టేబుల్ కరుణించలేదు. 
 
తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు చెప్పుకునేందుకు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన గర్భిణిని బెదిరింపులకు గురిచేశాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకోకుండా టూటౌన్ పోలీసులు నిందితుడైన కానిస్టేబుల్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. విషయం బయటకు పొక్కడంతో గర్భిణిపై లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్ గరికిముక్కుల రవిపై సస్పెన్షన్ వేటు వేశారు. బుధవారం రాత్రి 10 గంటల సమ యంలో కానిస్టేబుల్ లొంగిపోయాడు. 
 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్