Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠాణాల‌లో పెరిగిపోతున్న దొంగ‌త‌నాలు; రూ.7 ల‌క్ష‌లు మాయం!

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:17 IST)
దొంగ‌ల‌ను ప‌ట్టుకుని పోలీసులు త‌మ ఠాణాల్లో పెడ‌తారు. కానీ, విచిత్రంగా ఠాణాల్లోనే దొంగ‌త‌నాలు ఇటీవ‌ల‌ పెరిగిపోయాయి. మొన్న‌నీ మ‌ధ్య ఒక పోలీస్ స్టేష‌న్లో రిక‌వ‌రీ సొమ్ము గ‌ల్లంతు అయింది. ఇపుడు తాజాగా కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేష‌న్లో 7 ల‌క్ష‌ల రూపాయ‌లు మాయం అయ్యాయి. 
 
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదు రోజుల క్రితం 7 ల‌క్ష‌ల రూపాయ‌లు మాయం అయ్యాయి. ప్ర‌తి ఆదివారం మద్యం దుకాణాలలో వ‌సూల‌యిన‌ సొమ్మును పోలీస్ స్టేష‌న్లో డిపాజిట్ చేస్తారు. ఆ రోజు బ్యాంకుల‌కు సెల‌వు కావ‌డంతో స్టేష‌న్లో డ‌బ్బు ఉంచి, సోమ‌వారం ఉద‌యం వ‌చ్చి బ్యాంకులో క‌ట్టేస్తారు. ఇలాగే నూజివీడు స్టేష‌న్ లో డిపాజిట్ చేసిన సొమ్ము క‌న‌ప‌డ‌కుండా పోయింది. 
 
అదే సొమ్మును భ‌ద్ర‌ప‌ర‌చాల్సిన రైట‌ర్, కానిస్టేబుల్ జ‌నార్ధ‌న నాయుడు కూడా క‌న‌ప‌డ‌కుండా గైర్హాజ‌ర‌య్యాడు. దీనితో అత‌నిపై అనుమానం వ‌చ్చి, పోలీసులు అంత‌ర్గ‌త విచార‌ణ ప్రారంభించారు. త‌ను ఇంట్లో కూడా క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో, ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు పరారైన కానిస్టేబుల్ జనార్దన్ నాయుడి కోసం వెతుకులాట ప్రారంబించారు. చివ‌రికి ఆయ‌న్ని అదుపులోకి తీసుకున్నారు.
 
సాంకేతిక పరిజ్ఞానంతో జనార్దన్ నాయుడు కన్యాకుమారి లో ఉన్నట్లు గుర్తించి, అక్క‌డికి వెళ్లి, అతన్ని అదుపులోకి తీసుకుని నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ కి తీసుకురానున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments