Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కట్టడిలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ: సజ్జల రామకృష్ణారెడ్డి

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (16:05 IST)
కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

కరోనా కట్టడిలో అధికారులకు జగన్‌పూర్తి స్వేచ్ఛను ఇచ్చారన్నారు. గుజరాత్‌ నుంచి మత్స్యకారులను తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

కరోనా టెస్ట్‌లు చేయడంలో దేశం ప్రధమస్థానంలో ఉందని ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కరోనా వైరస్‌ కంటే చంద్రబాబు ప్రమాదకరమని విమర్శించారు. 

తన ప్రచారం ద్వారా చంద్రబాబు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని, హైదరాబాద్‌లో కూర్చొని లేఖలు రాయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు ఇంకా తానే సీఎంని అనే భ్రమలో ఉన్నారని, ఆయన పైత్యం పరాకాష్టకి చేరిందని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments