Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (17:58 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కైకాల టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కైకాల చిన్న కుమారుడికి ఫోన్ చేశారు. కైకాల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయం కావాలంటే అడగాలని సీఎం జగన్ ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజుల పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స జరుగుతోంది. కైకాల ఆరోగ్యం మెరుగవుతున్నట్లు బుధవారం కైకాల కుమార్తె తెలిపారు. ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్న కైకాల ర‌క్త‌పోటు త‌గ్గింది. కిడ్నీ ప‌నితీరు మెరుగుప‌డిందని అపోలో వైద్యులు బుధవారం హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని చెప్పారు.
 
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మచిలీపట్నం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా కైకాలను పరామర్శించిన విషయం తెలిసిందే. అలాగే చిన్న బాబుతో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఫోన్లో కైకాల ఆరోగ్యం గురించి మాట్లాడి ధైర్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments