Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ - అమిత్ షాలతో భేటీ కోసం హస్తినకు సీఎం జగన్

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (12:36 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాత్రి 7.30 గంటలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని వైకాపా ఎంపీలు ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, వైకాపా నేత, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో వీరివద్ద సీబీఐ పలుమార్లు విచారణ జరిపింది. అయితే వైఎస్.అవినాశ్ రెడ్డి అరెస్టుకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. దీంతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయలేదు. లేకపోతే గత వారమే అరెస్టు చేసివుండేది. కోడికత్తి కేసులో కూడా బాధితుడైన సీఎం జగన్‌ స్వయంగా హాజరుకావాలని ఎన్.ఐ.ఏ కోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments