Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో పర్యటించనున్న జగన్ : అపాచీ కర్మాగారానికి శంకుస్థాపన

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (12:27 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పోలీసు విభాగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి విమానాశ్రయానికి చేరుకున్న తరువాత అక్కడ నుంచి ఒక ఆలయాన్ని ప్రారంభించడానికి హెలికాప్టర్లో ఆలయం సమీపానికి చేరుకుంటారు. 
 
ఆలయం వద్ద హెలిప్యాడ్, ఆలయం పరిసరాలలో భద్రతా ఏర్పాట్లను అనంతపురం రేంజ్ డి.ఐ.జి రవి ప్రకాష్, జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఎస్పీ సతీష్ బాబు కలిసి బుధవారమే పర్యవేక్షించారు. 
 
అదేవిధంగా శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరు వద్ద అపాచీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే ప్రాంతాలలో కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించి భద్రతను సమీక్షించారు. 
 
ప్రతి ప్రాంతంలో సంబంధిత పోలీసు అధికారులకు సూచనలు ఇస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
 
సీఎం పర్యటనకు పోలీస్ అధికారులు సివిల్ విభాగం నుండి 1,050, ఏ.ఆర్ విభాగం నుండి 730 మంది మొత్తం 1,780 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం