Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్‌లైన్‌ కాల్‌మనీ వ్యవహారాలపై దృష్టిపెట్టండి : సీఎం ఆదేశం

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (19:21 IST)
ఆన్‌లైన్‌ కాల్‌మనీ వ్యవహారాలపై దృష్టిపెట్టాలని సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. సీఎంఓ కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారు. యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి, ఆ రుణాలు వసూలు చేయడానికి చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నారన్న సమాచారం నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాల్‌మనీ వ్యవహారాలను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 
 
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడిన బాధిత కుటుంబాలకు సీఎం వైయస్‌.జగన్‌ ఆర్థికసాయం ప్రకటించారు. గుంటూరు జిల్లా కొర్రపాడులో ఆత్మహత్యచేసుకున్న పదోతరగతి బాలిక సౌమ్య కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని సీఎం ఆదేశించారు. లైంగిక వేధింపుల కారణాలతో తాను ఆత్మహత్యచేసుకున్నట్టుగా మృతురాలి వీడియో బయటకు వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణం దశరాజుపల్లెలో జరిగిన సజీవదహన ఘటనలో మరణించిన దివ్యాంగురాలు, వలంటీర్‌ భువనేశ్వరి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం