Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా - పెన్నా నదులను అనుసంధానం చేయండి : చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (15:20 IST)
నదులను అనుసంధానం చేయాలని కేంద్ర జలవనరులశాఖామంత్రి ఉమాభారతికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఒక రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఉమాభారతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ‘జల మంథన్’ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. 
 
నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతోందని గుర్తు చేశారు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నదుల అనుసంధానం ఎంతో అవసరమన్నారు. కొన్ని దేశాలు సముద్రపు నీటిని మంచినీరుగా మార్చుకుంటున్నాయని చెప్పారు. జలవనరులు చాలా ముఖ్యమైనవని, వాటిని కాపాడుకుంటూనే మైక్రో ఇరిగేషన్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి నొక్కివక్కాణించారు. 
 
ఈ దఫా ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం తక్కువ వర్షపాతం మాత్రమే నమోదైందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో నీటి నిర్వహణ మరింత జాగ్రత్తగా వుండాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గోదావరి, కృష్ణ, పెన్నా నదులను అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
ఈ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, పలువురు ఉన్నతాధికారుల, నీటి పారుదల రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు జలవనరుల మంత్రి ఉమాభారతి, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైల్వేమంత్రి సురేష్ ప్రభును కూడా కలిశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments