Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మొద‌లైన దోపిడీ! సినిమా టిక్కెట్ ధ‌ర రూ.295

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:31 IST)
సినిమా టిక్కెట్ల వివాదం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజుకుంటుండ‌గా, ఇపుడు తెలంగాణాలోనూ దాని ప్ర‌భావం ప‌డింది. సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెద్ద సినిమాల పేర్లు చెప్పి ఇష్టానుసారం పెంచే వీలులేద‌ని ఏపీ ప్ర‌భుత్వం ఖ‌రాఖండితంగా చెప్పింది. జీవో నెంబ‌రు 35ను తెచ్చి, టిక్కెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించేసింది. దీనిపై సినీ హీరోల కామెంట్లు, వైసీపీ నేత‌ల ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో హీటెక్కిపోయింది. ఇక ఇక్క‌డి ప్ర‌భుత్వం దిగిరాలేద‌ని తెలంగాణాలో సినీ వ‌ర్గాలు పావులు క‌దిపాయి.
 
 
తెలంగాణాలో పెద్ద సినిమాల‌కు ఇష్టానుసారం టిక్కెట్ల ధ‌ర‌లు పెంచుకోవచ్చ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీనితో సినీ అభిమానులను దోచుకునేందుకు ఆర్.ఆర్.ఆర్. సినిమా పేరు చెప్పి, ముంద‌స్తుగా, తెలంగాణలో భారీ దోపిడీకి  సినీ ప్ర‌ముఖులు రంగం సిద్ధం చేస్తున్నారు. 
 
 
ఆంధ్రా లో తమకి జరిగిన నష్టాన్ని తెలంగాణలో పూర్తి చేసేందుకు, ఏకంగా ప్రేక్ష‌కుల‌ను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్ర‌తినిధులు. మల్టీప్లెక్స్ లో రూ. 150 నుంచి 200 కు పెంచిన టిక్కెట్ ధరలను ... ఇపుడు ఆర్.ఆర్.ఆర్. వంటి పెద్ద సినిమాలు కోస‌మ‌ని అమాంతం రూ. 295కి ధ‌ర‌లు పెంచేశారు. ఇది కచ్చితంగా దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ఫ్యామిలీలకు చిన్న సినిమాలను దూరం చెయ్యడమేన‌ని ప్రేక్ష‌కులు మండిప‌డుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments