Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లా కేంద్రంలో హైటెక్ వ్యభిచారం.. అమ్మాయిలంతా వారే...

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (11:48 IST)
జిల్లా కేంద్రమైన చిత్తూరులో వ్యభిచారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగిపోతోంది. అమాయక, నిరుద్యోగ యువతులను ఈ ఊబిలోకి దించి.. హైటెక్ వ్యభిచారాన్ని గుట్టుచప్పుడు కాకుకుండా సాగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని సంతపేట, మురకంబట్టు, ప్రశాంత్‌నగర్‌, రామ్‌నగర్‌ కాలనీ, సత్యనారాయణపురం, మార్కెట్‌ చౌక్‌ ప్రాంతాల్లో ఈ హైటెక్‌ వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతోంది.
 
ఈ ప్రాంతాల్లో గృహాల్లోనే కాకుండా నగరంలోని పలు ప్రముఖ లాడ్జిలు, గెస్ట్‌ హౌస్‌లు, కొన్ని బ్యూటీ పార్లర్లు వ్యభిచార కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఈ వ్యభిచార గృహాలకు అవసరమైన అమ్మాయిలను రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి నిరుపేద యువతులను తరలిస్తున్నారు. ఇందుకోసం కొందరు మధ్యవర్తులు ఈ వ్యభిచార గృహాల నిర్వహాకులతో ఒప్పందం కుదుర్చుకుని అమ్మాయిలను సరఫరా చేస్తున్నాయి. 
 
అలాగే, జిల్లాలోని కొన్ని విద్యా సంస్థలకు చెందిన హాస్టల్స్‌లో ఉండే నిరుపేద అమ్మాయిలను గుర్తించి, వారిని ముగ్గులోకి దించి.. ఈ వ్యభిచార నిర్వాహకులకు అప్పగిస్తున్నారు. మరికొందరి అమ్మాయిలకు అయితే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి తెలివిగా ఈ ఊబిలోకి లాగుతున్నారు. ప్రధానంగా సంతపేట, మురకంబట్టు, ప్రశాంత్‌నగర్‌, రామ్‌నగర్‌ కాలనీల్లో రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు జిల్లాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. నగరంలోని పలు ప్రధాన కూడళ్ళలో ప్రత్యేక నెట్‌వర్క్‌ ద్వారా ఈ తంతు కొనసాగుతోంది. సెల్‌ ఫోన్‌ ద్వారా, మధ్యవర్తుల ద్వారా విటులను వ్యభిచార గృహాలకు రప్పించి వేలకువేలు దండుకుంటున్నారు.  

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments