పోలీస్ స్టేషన్‌కి సాయం కోసం వెళ్తే.. అందంగా వుందని అలా వాడుకున్నారు..

సెల్వి
గురువారం, 25 సెప్టెంబరు 2025 (23:17 IST)
Woman
సాయం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్తే.. అక్కడ మత్తుమందు ఇచ్చి కానిస్టేబుల్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక పలమనేరు పీఎస్‌కు వచ్చిన బాధితురాలుకు పలమనేరు హోంగార్డ్, బంగారుపాళ్యం కానిస్టేబుల్ వేధింపులకు గురిచేశారు. 
 
ఈ ఘటనపై ఈనెల 13న ఎస్పీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌, హోంగార్డు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
భర్త వేధింపుల కారణంగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గంటావూరుకు చెందిన బాధితురాలికి ముగ్గురు పిల్లలున్నారు. నాలుగు నెలల క్రితం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అయితే ఆమె అందంగా ఉందని సీఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు కిరణ్‌కుమార్‌ ఆమెపై కన్నేశాడు. బాధితురాలి ఫిర్యాదులోని ఫోన్‌ నంబరును తీసుకుని ఆమెకు సాయం చేస్తానంటూ బాధితురాలికి రాత్రుల్లో ఫోన్‌ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఆమెకు కానిస్టేబుళ్లతో వేధింపులు తప్పలేదు. 
 
ఇక లాభం లేదనుకుని పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందామని దేవరకొండలో ఆలయం వద్దకు వెళ్లింది. అక్కడా పోలీసులు ఆమెను వదల్లేదు. ఈ సమయంలో కొండపైకి గస్తీ కోసమెళ్లిన బంగారుపాళెం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్‌ కాదని సముదాయించి పిల్లలతో పాటు బాధితురాలికి మద్యం కలిపిన కూల్‌డ్రింక్‌ బాటిళ్లను ఇచ్చి వారు మత్తులో ఉండగా పిల్లలను కారులో పడుకోబెట్టి బాధితురాలితో పాటు కొండపైనుంచి కిందికి వస్తూ అడవిలోని మరో దారిలోకి తీసుకెళ్లి అక్కడ బాధితురాలిపై లైంగిక దాడి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

Samantha Ruth Prabhu: రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత రూతు ప్రభు

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం