Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన భవనం

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (15:08 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అపారనష్టం వాటిల్లేలా కనిపిస్తోది. మరోవైపు, లక్షలాది మంది బాధితులు వరద నీటిలో ఉన్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదిలావుంటే, చిత్తూరు జిల్లాలో వరద నీరు ఉధృతికి ఓ భవనం కొట్టుకునిపోయింది. 
 
ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని తిరుచానూరులో 2 అంతస్తుల భవనం నదిలో కొట్టుకునిపోయింది. ఈ భవనం కూలిపోతున్న దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
మరోవైపు, తిరుమల గిరులతో పాటు.. తిరుపతి పట్టణంలో జోరు వర్షం కురుస్తుండటంతో తిరుపతి పట్టణం నీట మునిగిపోయింది. దీంతో తిరుపతి పట్టణం ఇపుడు కళావిహీనంగా కనిపిస్తుంది. అనేక మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి చేరుకుని వరద సహాయక చర్యలను చేపట్టింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం