Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో పట్టాలెక్కిన గజరాజులు: చెన్నై-బెంగుళూరు మధ్య నిలిచిన రైళ్లు!!

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (12:42 IST)
అమ్మో గజరాజులు పట్టాలెక్కారు. దీంతో చెన్నై-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చిత్తూరు జిల్లాలో మరోసారి గజ రాజులు వీరంఘం సృష్టించాయి. కుప్పం మండలం, మిట్టపల్లి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్థరాత్రి పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. 
 
అనంతరం ఏనుగుల గుంపు సమీపంలోని రైల్వే ట్రాక్పైకి రావటంతో గమనించిన రైల్వే సిబ్బంది ఈ సమాచారాన్ని అధికారులకు అందించారు. 
 
దీంతో రైల్వే అధికారులు చెన్నై- బెంగళూరు మధ్య నడిచే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం గంట సేపటి తర్వాత రైళ్ల రాకపోకలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 
 
కాగా పదిహేను రోజుల క్రితం అడవి నుంచి దారి తప్పి గ్రామాల బాట పట్టిన ఏనుగులు చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై అధికారులు తగు చర్యలు చేపట్టి, వాటిని అడవిలోకి తరలించాలని కోరుతున్నారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments