Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా వేస్ట్.. ప్రత్యేక ప్యాకేజీ బెస్ట్ : కాంగ్రెస్ నేత చింతా మోహన్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (12:25 IST)
ప్రత్యేక హోదా వద్దనే వద్దని, ప్రత్యేక ప్యాకేజీనే కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతా మోహన్ అంటున్నారు. ప్రత్యేక హోదా వస్తే వందలాది మంది పారిశ్రామికవేత్తలు ఆదాయపన్నును ఎగ్గొట్టాలని భావిస్తున్నారని, అందుకే ఆ తరహా డిమాండ్ చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
తిరుపతిలో సోమవారం కృష్ణదేవరాయ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాయలసీమకు రూ.57 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని, చిత్తూరు జిల్లాకు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, 200 మంది పారిశ్రామిక వేత్తలు ఆదాయపు పన్ను ఎగ్గొట్టేందుకే ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తమకు ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీయే కావాలని కోరారు. 
 
కాగా, విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే కావాలని పలువురు నేతలు కేంద్ర్రాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతా మోహన్ ఈ తరహా వాదనను తెరపైకి తీసుకుని రావడం గమనార్హం. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments