Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ జైలుకెళ్లడంతో జగన్‌కు భయం పట్టుకుంది: చినరాజప్ప

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (12:35 IST)
అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ సీఎం జయలలిత జైలుకెళ్లడంతో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిలో భయం పట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు.
 
అక్రమాస్తుల కేసులో జయమ్మకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో జగన్‌ బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారని చినరాజప్ప తెలిపారు. శనివారం కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. కేవలం రూ.66 కోట్ల మేర అక్రమ సంపాదనకే జయకు నాలుగేళ్ల జైలు, రూ.100 కోట్ల జరిమానా పడిన వైనాన్ని ప్రస్తావించారు. 
 
ఇక వేల కోట్ల రూపాయలు సంపాదించిన జగన్‌కు కూడా శిక్ష తప్పదని చెప్పారు. జయకు జైలు శిక్ష నేపథ్యంలో జగన్‌లోనూ భయం నానాటికీ పెరిగిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments