తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (23:10 IST)
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనాలంటే చెమటలు పడుతున్నాయి. ఏపీలో కేజీ చికెన్ ఏకంగా రూ.300 దాటింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర.

ఇది దేశంలో కెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనాలంటే చెమటలు పడుతున్నాయి. ఏపీలో కేజీ చికెన్ ఏకంగా రూ.300 దాటింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇది దేశంలో కెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం.

పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని 60 శాతానికి తగ్గించడంతో కోళ్ల లభ్యత లేకుండా పోయింది. ఇక హైదరాబాద్ లో కేజీ చికెన్ రూ. వరకు పలుకుతోంది. రంజాన్ నెలలో చికెన్ వినియోగం పెరగడం కూడా రేటు పెరిగేందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
 
మరోవైపు.. కోవిద్-19 భయంతో మొన్నటివరకు కిలో బ్రాయిలర్‌ చికెన్‌ రూ.25-50 లోపే ధర పలికింది. చివరకు బతికున్న కోడిని రూ.25కు ఇచ్చినా తీసుకునేవారు లేరు. పెంపకం, మేత ఖర్చులు కూడా రాక రైతులు నష్టాలను చవిచూశారు. దీనివల్ల కొన్నిచోట్ల కోళ్లను మేపలేక మిన్నకుండిపోయారు. మరికొన్ని చోట్ల గొయ్యి తీసి పాతేశారు.

ఈ పరిణామాలతో 60శాతం కోళ్ల ఫారాల్లో కోళ్లే లేకుండా పోయాయి. ఇంటిగ్రేషన్‌ కంపెనీలు కూడా కొత్త కోడిపిల్లల బ్యాచ్‌లను పెంచడం ఆపేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments