Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరిలోపు అంతర్వేదిలో రథం నిర్మాణం: మంత్రి వెలంప‌ల్లి

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (22:21 IST)
వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. అప్పటిలోగా అంద‌రి అభిప్రాయం మేర‌కు రథం ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా  రథాన్ని సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను అదేశించిన్న‌ట్లు దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. 
 
సొమ‌వారం బ్రాహ్మ‌ణ వీధిలో దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌తో మంత్రి వెలంప‌ల్లి స‌మావేశం అయ్యారు. 
 
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందన్నారు. 
 
రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించారన్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించారన్నారు. ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా రూపొందిస్తున్నారు. 
 
కొత్త రథం నిర్మాణంతో పాటు.. ర‌థ‌శాల మరమ్మతులు నిమిత్తం రూ.95 లక్షలు ఖర్చవుతుందని దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించడం జ‌రిగింద‌న్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments