Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవినేని ఉమకు ఏదైనా జ‌రిగితే... ఖ‌బ‌డ్దార్: చంద్రబాబు నాయుడు

Webdunia
శనివారం, 31 జులై 2021 (11:56 IST)
అక్ర‌మాల‌ను ఎత్తి చూపితే...అన్యాయంగా అరెస్టులు చేస్తారా? ఇదేం రాజారెడ్డి రాజ్యాంగ‌మా? దేవినేని ఉమకు ఏదైనా జ‌రిగితే... ఖ‌బ‌డ్దార్! అని ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న స‌హ‌చ‌రుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ‌ను అరెస్టు చేసి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉంచ‌డాన్ని అమానుషంగా చంద్ర‌బాబు అభివ‌ర్ణించారు.
 
మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబ స‌భ్యుల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. విజ‌య‌వాడ శివారులోని గొల్ల‌పూడిలో దేవినేని ఇంటికి వ‌చ్చిన చంద్ర‌బాబు, ఉమ భార్య పిల్ల‌ల‌తో మాట్లాడారు. కొండ‌ప‌ల్లి రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతోంద‌ని, నిజ‌నిర్ధార‌ణ‌కు వెళ్లి మాజీ మంత్రి ఉమ అరెస్ట్ అయిన నేప‌థ్యంలో ఆయ‌న కుటుంబానికి ధైర్యం అందించేందుకు తాను వ‌చ్చిన‌ట్లు చంద్ర‌బాబు తెలిపారు.

దేవినేని ఉమ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని బాబు ధైర్యం చెప్పారు. దేవినేని ఉమ తండ్రి, భార్య‌, పిల్ల‌ల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. చంద్ర‌బాబుతో పాటు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, జ‌డ్పీ ఛైర్ప‌ర్స‌న్ అనూరాధా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
 
చంద్ర‌బాబు రాక సంద‌ర్భంగా గొల్ల‌పూడిలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. భారీగా తెలుగుదేశం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉమ ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్నారు. దేవినేని ఉమ‌కు ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే స‌హించేది లేద‌ని కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి దేవినేని ఉమ‌ను త్వ‌ర‌గా విడిపించాల‌ని టీడీపీ అధినేత‌ను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments