Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనాలు ఎక్కువ తప్పులు చేసి.. ఎక్కువ డబ్బులు హుండీల్లో వేస్తున్నారు.. : చంద్రబాబు

Webdunia
బుధవారం, 25 మే 2016 (15:43 IST)
విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాలకు కష్టాలు వస్తే దేవుడిని నమ్ముకుంటారన్నారు. అలాగే, అందుకే ఎక్కువ తప్పులు చేస్తూ.. ఎక్కువ డబ్బులు హుండీల్లో వేస్తున్నారనీ, దీనివల్ల హుండీ ఆలయాల ఆదాయం పెరుగుతోందన్నారు. తద్వారా తాము చేసిన పాపాలు పోతాయని వారు భావనగా ఉందన్నారు. 
 
ఏపీలో దేవాదాయశాఖ ఆదాయం బాగా పెరిగిందని, ఆ శాఖ ఆదాయ అభివృద్ధికి అధికారులు కష్టపడి పనిచేయకపోయినా, 27శాతం ఆదాయం పెరిగిందని చంద్రబాబు తెలిపారు. పక్కరాష్ట్రాల అభివృద్ధి చూసి అసూయ కలుగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల కంటే బాగా పని చేయడం కోసం ఆలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 
 
అదేసమయంలో కొందరు మద్యం తాగకుండా ఉండటం కోసమే దీక్షలు చేస్తున్నారంటూ పరోక్షంగా అయ్యప్ప భక్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ దీక్షలు చేసే రోజుల్లో ఆ 40 రోజులు లిక్కర్ అమ్మకాలు తగ్గుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments