Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు, వేమూరి హ‌రికృష్ణే ఏపీ ఫైబర్‌నెట్‌లో అవకతవకల‌కు బాధ్యులు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:00 IST)
చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి అన్నారు. విజ‌య‌వాడ‌లోని ఏపీ ఫైబర్‌నెట్ కార్యాల‌యంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నారా చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా, బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్నకంపెనీకి టెండర్‌ కట్టబెట్టారన్నారు. ఏడాది సస్పెన్షన్ ఉన్నా, టెరా సాఫ్ట్ కంపెనీకి రెండు నెలల్లోనే టెండర్‌ కట్టబెట్టారన్నారు. టెరా సాఫ్ట్‌కు టెండర్‌ కేటాయించేందుకే కాల పరిమితిని కూడా పొడిగించారన్నారు. 
 
చంద్రబాబు, వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ కలిసే కుట్రకు పాల్పడ్డారని గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను టెరా సాఫ్ట్‌లో రాజీనామా చేయించి ఫైబర్ నెట్‌లో డైరెక్టర్‌గా తీసుకున్నారన్నారు.టెండర్లలో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదని గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. 19 మందిపై సీఐడీ అనుమనితులుగా కేసులు నమోదు చేసింద‌ని, దర్యాప్తు  పూర్తయ్యాక మరింత మంది పాత్ర వెలుగులోకి రావొచ్చని గౌతమ్‌రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments