Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైర్ బ్రాండ్ రోజాను టార్గెట్ చేసిన చంద్రబాబు.. నగరి అభివృద్ధికి అడ్డం పడుతున్నారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యే ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో ఓవరాక్షన్ చేయడం, దురుసుగా ప్రవర్తించి.. అధికార వర్గం కళ్లల్లో పడిన రోజాకు కష్టాలు తప్పట్ల

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (09:28 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యే ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో ఓవరాక్షన్ చేయడం, దురుసుగా ప్రవర్తించి.. అధికార  వర్గం కళ్లల్లో పడిన రోజాకు కష్టాలు తప్పట్లేదు. పార్టీలో జగన్ తర్వాత క్రేజున్న నాయకురాలు రోజానే. వైసీపీలో నెం.2 నేతగా పేరు కొట్టేసిన రోజా.. టీడీపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టడంలో దిట్ట. అయితే రోజాను అధికారిక వర్గం టార్గెట్ చేసినట్లు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. 
 
రోజా క్రేజ్‌ను తగ్గించేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో భాగంగా రోజాను సొంత నియోజక వర్గ ప్రజల్లో చులకన చేసేందుకు ఆ నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రోజాయే అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరి నియోజకవర్గంపై కక్షపూనారని రోజా విమర్శించారు.
 
ఇందులో భాగంగా జన్మభూమి కమిటీలు, కొందరు అధికారులు కలిసి చివరకు సామాజిక భద్రత పించన్లు కూడా ఇక్కడి అర్హులకు రాకుండా చేస్తున్నారని రోజా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేగాకుండా ఇక్కడ పనిచేస్తున్న అధికారులను కూడా సొంత నియోజకవర్గం కుప్పంకు తరలించారని రోజా ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం నగరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా వారిని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నగరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎంతగా పోరాడుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు సహకరించట్లేదని రోజా ఫైర్ అవుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments