Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దనోట్లను రద్దు చేయమన్నారు సరే... మరి రూ.2000 నోటు సంగతేంటి బాబూ...?

హైద‌రాబాద్: దేశంలో నోట్ల రాజ‌కీయం క‌ల‌క‌లం రేపుతోంది. దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది. అయితే ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు మాట నెగ్గిందంటూ చేస్తున్న ప్ర‌చారం అతిశ‌యోక్తిలా క‌నిపిస్తోంది. 500

Webdunia
బుధవారం, 9 నవంబరు 2016 (18:30 IST)
హైద‌రాబాద్:  దేశంలో నోట్ల రాజ‌కీయం క‌ల‌క‌లం రేపుతోంది. దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది. అయితే ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు మాట నెగ్గిందంటూ చేస్తున్న ప్ర‌చారం అతిశ‌యోక్తిలా క‌నిపిస్తోంది. 500 నోట్లు ర‌ద్దు చేయాల‌ని చంద్ర‌బాబు కేంద్రాన్ని కోరిందే త‌డ‌వు, ప్ర‌ధాని మోదీ వాటిని ర‌ద్దు చేశార‌ని ఏపీలో అనుకూల మీడియా ప్ర‌చారం చేస్తోంది. 
 
అర్ధ‌రాత్రి మోదీ సాహ‌సోపేతంగా చేసిన ఈ ప్ర‌క‌ట‌న క్రెడిట్ అంతా బాబుదే అన్న‌ట్లు పేర్కొంటోంది. కానీ, చంద్రబాబు ఆశించిన‌ట్టుగా వాస్త‌వానికి మోడీ ప్ర‌భుత్వం 500 నోట్లు రద్దు చేయ‌లేదు. పైగా వెయ్యి నోట్ల స్థానంలో రెండువేల నోట్ల ప్ర‌వేశ‌పెట్ట‌డం బాబు అంచ‌నాల‌కు భిన్నంగా ఉంది. ఆయ‌న ఆశించిన దానికి విరుద్ధంగా ఉంది.
 
అయితే మీడియా మాత్రం బాబు మాట గెలిచింద‌నే ప్ర‌చారం మాత్రం సాగిపోతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా 500 నోట్లు రద్దు చేశార‌నే ప్ర‌చారం సాగిస్తున్నారు. కానీ వాస్త‌వానికి 500 నోట్ల మార్పిడి మాత్ర‌మే జ‌రిగింది. కొత్త నోట్లు చెలామ‌ణీలోకి రాబోతున్నాయి. దానికితోడుగా వెయ్యి నోట్ల‌కు డ‌బుల్ చేస్తూ రెండు వేల నోట్లు ముందుకు రాబోతున్నాయి. త‌ద్వారా బాబు చెప్పిన‌ట్టు పెద్ద నోట్ల ర‌ద్దు కావ‌డం లేదు స‌రిక‌దా రెండింతల రూ. 2000 నోటు ముందుకొస్తోంది. అంటే బాబు చెప్పిన మాట‌కు, వాస్త‌వ ఆచ‌ర‌ణ‌కు పొంత‌న‌లేనట్టే కదా...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments