Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారావారిపల్లెలో బాబు.. మట్టి, నీరు సేకరణ.. పూజలో డాలర్ శేషాద్రి!

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (11:55 IST)
ప్రతిష్టాత్మక అమరావతి రాజధాని నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మట్టి, నీరు సేకరిస్తున్నారు. అంతేగాకుండా అమరావతి నిర్మాణం విజయవంతం కావాలని పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తన స్వగ్రామం నారావారిపల్లెలో వేద పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు మట్టి, నీరు సేకరిస్తున్నారు. 
 
మంగళవారం ఉదయం విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు మట్టి, నీరు సేకరించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తిరుమల నుంచి డాలర్ శేషాద్రితో పాటు, పలువురు అర్చకులు విచ్చేశారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఊరు నుంచి తెప్పించిన మట్టిని, నీటిని ఉపయోగించాలని ఇంతకు ముందే నిర్ణయించిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్పమంలో ప్రతి ఊరు, ప్రతి గ్రామం భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మట్టి-నీరు సేకరణ మొదలైంది. ఈ క్రమంలో విజయవాడలోని తన నివాస స్థలం గొల్లపూడిలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మట్టి, నీరు సేకరించారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తరువాత అధికారులకు అప్పగించనున్నారు. 
 
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పోలీసులైన్స్ అయ్యప్పస్వామి ఆలయంలో మంత్రి యనమల రామకృష్ణుడు గోపూజ నిర్వహించారు. అనంతరం రాజధాని నిర్మాణానికి మట్టి, నీరు సేకరణను ప్రారంభించారు. ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు మట్టి, నీరు సేకరించే క్రమంలో బిజీ బిజీగా ఉన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments