Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణకు మంచి పునాది ఉంది.. ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు

వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (17:20 IST)
పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయం (పీసీఐ)లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చెప్పారు. రూ.3,08,732తో గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాలను అధిగమించి అత్యధిక పీసీఐని నమోదు చేసిందని నాయుడు తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,19,518 పీసీఐ నమోదైందని ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో తెలిపారు. తెలంగాణకు మంచి పునాది ఉంది. ప్రస్తుత ప్రభుత్వానికి తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మంచి అవకాశం ఉంది.. అని చంద్రబాబు అన్నారు. 
 
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయాయి. గత 10 సంవత్సరాలలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పీసీఐలో వ్యత్యాసం 35 శాతం ఉంది. ఇందుకు హైదరాబాద్ ప్రధాన కారణంగా ఉంది. 2014 నుంచి 2019 వరకు ఏపీలో వైకాపా సర్కారు కారణంగా 27.5 శాతం తేడా తగ్గింది. 
 
విభజన కంటే, గత ఐదేళ్లలో వైకాపా పాలన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. అదే తమ సర్కారు కొనసాగి ఉంటే, పీసీఐలో వ్యత్యాసం 100 శాతానికి పెరిగి ఉండేది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణలో, హైటెక్ సిటీతో ప్రారంభమైన అభివృద్ధి హైదరాబాద్‌తో పాటు తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగడానికి మార్గం సుగమం చేసింది. అది టీడీపీ నిబద్ధత అని ఆయన అన్నారు 
 
గతంలో, మేము విజన్ 2020ని ఊహించినప్పుడు, చాలా మంది విమర్శించారు. కొందరు దీనిని 420 విజన్ అని పిలిచారు. ఇప్పుడు, 2047 నాటికి భారతదేశం అగ్రశ్రేణి దేశంగా ఎదుగుతుందని తాను హామీ ఇస్తున్నాను.. అంటూ చంద్రబాబు కామెంట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments