Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

సెల్వి
గురువారం, 3 జులై 2025 (15:55 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోని మొట్టమొదటి టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ (డిఎన్‌సి)ను ప్రారంభించారు. 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సిలు), 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించబడిన టాటా డిఎన్‌సి 12 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది. 
 
ఇంకా రోగుల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తుంది. ఈ సెంటర్ నియోజకవర్గం అంతటా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, వనరులను ఏకీకృతం చేస్తుంది. డిజిటల్ సాధనాలు, ప్రామాణిక ఆరోగ్య ప్రోటోకాల్‌ల ద్వారా సంరక్షణను మెరుగుపరుస్తుంది. 
 
తద్వారా సకాలంలో రోగ నిర్ధారణ, కౌన్సెలింగ్, తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం.. ఇంకా పీహెచ్‌సీలలో వర్చువల్ స్పెషలిస్ట్ యాక్సెస్‌ను హామీ ఇస్తుంది. మొదటి విడతగా కుప్పంలో ఈ సెంటర్‌ను ప్రారంభించారు. రెండవ దశలో చిత్తూరు జిల్లా, మూడవ దశలో రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరించనున్నట్లు ఏపీ సర్కారు ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
మరోవైపు బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు ఎటువంటి హాని జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు గురువారం హామీ ఇచ్చారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, "బనకచర్ల ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. హాని కలిగించదు. తెలంగాణ గోదావరి నీటిపారుదల ప్రాజెక్టులను నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. సముద్రంలోకి ప్రవహించే 2,000 టిఎంసి నీటిలో 200 టిఎంసిలను ఉపయోగించడం ద్వారా, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి." అని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments