Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యేలు 'అలగాజనం'... అలా ఎందుకు అన్నానో వివరణ ఇస్తా: చంద్రబాబు

రాష్ట్ర శాసనసభలో తాను అలగాజనం అన్న పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందో సభలోనే వివరిస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. సభలో ఆ పదాన్ని తాను వాడటంపై, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం చెబుతూ, సభా

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (10:53 IST)
రాష్ట్ర శాసనసభలో తాను అలగాజనం అన్న పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందో సభలోనే వివరిస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. సభలో ఆ పదాన్ని తాను వాడటంపై, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం చెబుతూ, సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో సభలో వైకాపా సభ్యుల ప్రవర్తన, తాను ఎందుకు అలగాజనం అని అనాల్సి వచ్చిందన్న అంశాలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు మరికాసేపట్లో ప్రసంగించనున్నారు. సభలో సీఎం మాట్లాడిన మాటలు తమను అగౌరవపరచడమేనని వైకాపాకు చెందిన దళిళ, ఎస్సీ ఎస్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు.
 
ఇదిలావుండగా, సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ‘అలగాజనం’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తమ హక్కులకు భంగం వాటిల్లిందని, అందుకే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments