Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ది గొప్ప మనస్సు.. ఎపుడూ ముందుంటారు : చంద్రబాబు

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (14:05 IST)
విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. హుదూద్ తుఫాను బాధితుల కోసం పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.50 లక్షల చెక్కును గురువారం వైజాగ్‌లో చంద్రబాబుకు ఆయన అందజేశారు. 
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు మాట్లాడుతూ... తుపాన్ బాధితులను ఆదుకోవడం అందరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ఖర్చులు ఎంతైనా ఫర్వావాలేదు... ప్రజల బాధలు తీరాలనేదే తన లక్ష్యమన్నారు. హుదూద్ తుఫానుకు ఆర్థిక సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నాని తెలిపారు. 
 
బంగాళదుంపల కోసం బెంగాల్ సీఎంతో మూడుసార్లు మాట్లాడినట్లు చంద్రబాబు వివరించారు. నేటి నుంచి తుఫాను సహాయ కార్యక్రమాలు అన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత తీరిందన్నారు. విశాఖ ప్రజల్లో ఆత్మస్థైర్యం కలిగించామన్నారు. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments