కేసీఆర్ చెప్పి చేస్తున్నారు... చంద్రబాబు చెప్పకుండా చేస్తున్నారు.. ఏంటది?

తెలంగాణా సీఎం కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఏర్పాటు చేసి దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న‌ ఆలోచ‌న‌లో ఉన్నారు. కాంగ్రెస్, భాజ‌పాయేత‌ర కూట‌మి ఏర్పాటు దేశానికి ప్రస్తుతం చాలా అవసరం అంటూ మ‌మ‌తా బెన‌ర్జీ, దేవెగౌడ‌, అఖిలేష్ యాద‌వ్‌, స్టాలిన్ వంటి నేత‌ల్ని క‌

Webdunia
మంగళవారం, 8 మే 2018 (17:40 IST)
తెలంగాణా సీఎం కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఏర్పాటు చేసి దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న‌ ఆలోచ‌న‌లో ఉన్నారు. కాంగ్రెస్, భాజ‌పాయేత‌ర కూట‌మి ఏర్పాటు దేశానికి ప్రస్తుతం చాలా అవసరం అంటూ మ‌మ‌తా బెన‌ర్జీ, దేవెగౌడ‌, అఖిలేష్ యాద‌వ్‌, స్టాలిన్ వంటి నేత‌ల్ని క‌లిసొచ్చారు. ఇవ‌న్నీ కేసీఆర్ బ‌హిరంగంగా చేస్తున్నారు. అయితే చంద్ర‌బాబు నాయుడు దేశ రాజకీయలపై పెద్దగా ఆస‌క్తి లేదంటూనే భ‌విష్య‌త్తు జాతీయ రాజ‌కీయాలకు అవ‌స‌ర‌మైన పునాదులను వేసుకుంటున్నారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన సందర్భంలో సీఎం చంద్రబాబుకు ఢిల్లీలో వివిధ పార్టీల నేత‌ల నుంచి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. మరోసారి బాబు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారని 12 పార్టీల‌తో కూట‌మి క‌ట్ట‌బోతున్నారంటూ జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఇదిలావుంచితే తాజాగా ఏపీ ప్రభుత్వం అమ‌రావ‌తిలో 11 రాష్ట్రాల ఆర్థిక‌ మంత్రుల స‌మావేశం నిర్వ‌హించి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన విధివిధానాల‌ను మార్చాలంటూ త్వ‌ర‌లోనే రాష్ట్రప‌తిని కలవాలని నిర్ణయించింది. 
 
జాతీయ స్థాయిలో రాజ‌కీయ‌ పార్టీలను సమీకరణ కోసం ఇవ‌న్నీ చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ఎక్కడా చెప్ప‌క‌పోయినా… భవిష్యత్తులో తాను పిలిస్తే ఢిల్లీ వేదిక‌గా క‌లిసి ప‌నిచేసేందుకు పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పకనే చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments