ఎన్టీఆర్ స్మారక నాణెం రిలీజ్.. జేపీ నడ్డాతో బాబు మాటామంతీ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (13:37 IST)
స్వర్గీయ ఎన్టీ రామారావు స్మారక నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆవిష్కరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. వారిలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన మాటామంతీ జరిపారు. వారిద్దరూ ఏదో అంశంపై మాట్లాడుతూ కనిపించారు. ఆ తర్వాత నడ్డాతో ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌లు కూడా సమావేశమయ్యారు. 
 
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న రూ.100 స్మారక నాణెంను రాష్ట్రపతి ముర్ము రిలీజ్ చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నడ్డా, బాబులు పక్కపక్కనే కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు.
 
చంద్రబాబు పక్కన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూర్చోగా, నడ్డా పక్కన దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూర్చొన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ ఎంపీలంతా జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిలో పురంధేశ్వరి, వెంకటేశ్వర రావు, చంద్రాబు, రఘురామకృష్ణంరాజు, సీఎం రమేష్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments