Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంతో సన్నిహితంగా ఉండటం నా స్వార్థం కాదు : చంద్రబాబు

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:00 IST)
కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటం వెనుక నా స్వార్థం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మంగళవారం సభలో మాట్లాడుతూ... విభజన చట్టంలోని పలు సెక్షన్లలో ఒకదానితో ఒకటికి పొంతన లేదన్నారు. సెక్షన్ 9 ఇంకా పరిష్కారం కాలేదని, సెక్షన్ 10లో ఇంకా సమస్యలున్నాయన్నారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సయోధ్యగా ముందుకు వెళ్లాలని, మన మధ్య సమస్యలు పరిష్కారం కాకపోతే కేంద్రం వద్దకు వెళదామని కూడా తెలంగాణకు చెప్పానన్నారు. తన వైపు ధర్మం ఉంది కాబట్టి ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేందుకు ఎప్పుడూ ముందుంటామన్నారు. 
 
కేవలం ప్రత్యేక హోదా కాదని అన్ని హక్కుల కోసం పోరాడాలని కోరారు. గతంలో ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి లేఖ ఇచ్చానన్న సీఎం, అందులో మొట్టమొదట కోరింది ప్రత్యేక హోదాపైనే అని వెల్లడించారు. ప్రధానిని ఇటీవల కలిసినప్పుడు ఆయనకు అన్ని విషయాలు వివరించానన్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments