Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావోస్‌నే రాష్ట్రానికి తీసుకొస్తా.. కేంద్ర ప్రభుత్వాన్నీ ఇక్కడికే రప్పిస్తా: బాబు గొప్పలు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వోత్కర్షకు అడ్డూ ఆపూ లేకుండా పోతున్నట్లుంది. విశాఖపట్నంలో జరుగుతున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రేంజిలో రెచ్చిపోయారు. దేశంలో నన్ను మించిన సీనియర్‌ నాయకుడు ఎవరూ లేరన్నారు. ప

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (04:59 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వోత్కర్షకు అడ్డూ ఆపూ లేకుండా పోతున్నట్లుంది. విశాఖపట్నంలో జరుగుతున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రేంజిలో రెచ్చిపోయారు. దేశంలో నన్ను మించిన సీనియర్‌ నాయకుడు ఎవరూ లేరన్నారు. ప్రధాని నుంచి రాష్ట్రపతి దాకా.. అందరినీ నేనే ఎంపిక చేసేవాడిని అని గప్పాలు కొట్టేశారు. 
 
ప్రపంచ ఆర్థిక సదస్సుకు కేంద్రస్థానమైన దావోస్‌నే ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తానని, ఇకపై అక్కడికి ఎవరూ వెళ్లరని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పారు. ప్రపంచం మొత్తాన్ని అనుసంధానం చేస్తానని తెలిపారు.  వచ్చే ఏడాది నిర్వహించే పారిశ్రామిక సదస్సులో కేంద్ర ప్రభుత్వాన్నీ భాగస్వామిగా చేస్తామన్నారు.  
 
ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు రావని, అలా వచ్చిన రాష్ట్రాలుంటే చూపించాలన్నారు. ఆయన శనివారం విశాఖలో విలేకరులతో మాట్లాడారు. పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలో 22,34,096 మందికి ఉపాధి  లభిస్తుందన్నారు.  
 
గతేడాది పారిశ్రామిక పెట్టుబడులపై ఇటీవల గవర్నర్‌ చేసిన ప్రసంగంలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు పేర్కొనడం సరికాదని, అది పొరపాటుగా అచ్చయిందని బాబు చెప్పారు. పెట్టుబడుల మొత్తాన్ని ఒక్కో చోట ఒక్కోలా ప్రకటించడాన్ని విలేకరులు ప్రశ్నించగా ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించారు. ‘‘కలెక్టర్ల సమావేశంలో రూ.5 వేల కోట్లు అని మీరే చెప్పారు’’ అని గుర్తుచేయగా... ‘‘మీరు విన్నారా’’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
---------------------
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments