Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన చంద్రబాబు: జూబ్లిహిల్స్ రోడ్ నెం.65లో...

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2015 (11:02 IST)
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. జూబ్లిహిల్స్‌ రోడ్‌ నెం. 65లో ఉంటున్న చంద్రబాబు కుటుంబం, జూబ్లిహిల్స్‌ రోడ్‌ నెం. 24లో గల ఓ అద్దె ఇంట్లోకి మారారు. ఇప్పటి వరకు ఉన్న ఇంటిని కూల్చి దాని స్థానంలో భారీ భవంతిని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అది పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా.
 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేతలు, సందర్శకుల తాకిడి పెరగడంతో ఇళ్లు ఇరుకుగా మారిందని, దీంతో ఇప్పటి వరకు ఉన్న ఇంటిని కూల్చివేసి, ఆ స్థానంలో కొత్త భవన నిర్మాణాన్ని నిర్మించనున్నారు. అయితే ఇంటి మార్పుకు వాస్తు కూడా ఒక కారణం అయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
బాబు మూడోసారి సీఎం పీఠం ఎక్కిన తరవాత వాస్తుకు ప్రాధాన్యం ఇచ్చి రూ.కోట్లు వెచ్చించి సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్, క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్న లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లలో అనేక మార్పుచేర్పులు చేసిన సంగతి తెలిసిందే.

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments