Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు వంటి నేతనే అరెస్టు చేస్తే ఇక సామాన్యుల పరిస్థితేంటి: విశాల్ ఆవేదన

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (16:04 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి ఒక విజనరీ లీడర్‌ను అరెస్టు చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని హీరో విశాల్ ప్రశ్నించారు. ఆయన నటించిన తాజా చిత్రం "మార్క్ ఆంటోనీ". ఈ చిత్రం సక్సెస్ మీట్ వేడుకలు హైదరాబాద్ నగరంలో జరిగాయి. ఇందులో పాల్గొన్న విశాల్.. చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు గొప్ప నాయకుడన్నారు. అలాంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. 
 
చంద్రబాబు పరిస్థితిని చూస్తే నాకే భయం వేస్తుందన్నారు. చంద్రబాబు నిజాయితీగల నేత అని కొనియాడారు. అలాంటి నేతకు ఇలాంటి దుస్థితి రావడం బాధను కలిగిస్తుందన్నారు. చంద్రబాబు అరెస్టు బాధాకరమని, ఆయనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు. 
 
కాగా, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించిన విషయం తెల్సిందే. తన మిత్రుడు గొప్ప పోరాటయోధుడని, ఆయన ఎలాంటి తప్పు చేయరని అన్నారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న విషయం తెల్సిందే. చంద్రబాబును ములాఖత్‌లో కలవాలని అనుకున్నానని, కానీ కుటుంబ ఫంక్షన్ కారణంగా కలుసుకోలేక పోయినట్టు చెప్పిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments