Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కుప్పం టూర్!: మూడు రోజుల పాటు..?

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:38 IST)
ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకర్గంలో పర్యటిస్తారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో కుప్పంలో ఆయన పర్యటన వుంటుంది. ఇందులో భాగంగా 12న విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన కోలారు, కేజీఎఫ్‌, బంగారుపేట మీదుగా రాళ్లబూదుగూరుకు చేరుకుంటారు. 
 
కుప్పం ఆర్టీసీ బస్టాండులో మధ్యాహ్నం 1.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటిస్తారు. ఇక 14న గుడుపల్లె సభలో పాల్గొని.., సాయంత్రం 4 గంటలకు సభ ముగించుకుని బెంగళూరు మీదుగా విజయవాడకు ప్రయాణమవుతారు. 
 
ఇకపోతే.. 1989 నుంచి 2019 ఎన్నికల వరకు చంద్రబాబు కుప్పంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఇక్కడ చంద్రబాబు మాటే సాగుతుంది. అయితే 2019 ఎన్నికల అనంతరం కుప్పంలో క్రమంగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ఎలాంటి ఎన్నికలైనా కుప్పంలో టీడీపీదే పైచేయి. కానీ ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. 
 
పంచాయితీ ఎన్నికల నుంచి ఎంపీపీ ఎన్నికల కుప్పంలో టీడీపీకి ఘోరమైన ఓటమి తప్పలేదు. పార్టీ పోటీలో ఉన్న లేకున్నా టీడీపీ బలపరిచిన అభ్యర్థినే అధిక శాతం గెలిపించుకోవడం కుప్పం ప్రజల ఆనవాయితీ. కానీ గత రెండున్నరేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనికితోడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య తలెత్తిన విభేదాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments