Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్యకు 'అవాస్త‌వాల వెంక‌య్య' అని బిరుదు ఇవ్వాలి: చ‌ల‌సాని శ్రీ‌నివాస్

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై ప్రత్యేక హోదా సాధన సమాఖ్య గౌరవాధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ తెచ్చినందుకు స‌న్మానాలు చేసుకోవ‌డం ప్ర‌త్యేక హోదాకు తూట్లు పొడ‌వ‌డమేన‌

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (13:51 IST)
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై ప్రత్యేక హోదా సాధన సమాఖ్య గౌరవాధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ తెచ్చినందుకు స‌న్మానాలు చేసుకోవ‌డం ప్ర‌త్యేక హోదాకు తూట్లు పొడ‌వ‌డమేన‌ని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... నాడు ప్రత్యేక హోదా కోసం గట్టిగా పట్టుబట్టిన వెంకయ్య.. ఇపుడు ప్రత్యేక ప్యాకేజీ అద్భుతమైనదిగా పేర్కొనడం ఆయనకే చెల్లింద‌న్నారు. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర శాఖ ఆయనకు వేలాది మంది కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య స‌న్మానం జరపడం శోచ‌నీయ‌మ‌న్నారు. 
 
అందుకే వెంక‌య్య‌నాయుడికి అవాస్త‌వాల వెంక‌య్య అని బిరుదు ఇవ్వాల‌ంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక హోదా కాకుండా ప్ర‌త్యేక ప్యాకేజీ లాభం చేస్తోంద‌ని వెంక‌య్య‌నాయుడు చేస్తోన్న వ్యాఖ్యల‌ను ఆయ‌న తిప్పికొట్టారు. ప్ర‌త్యేక హోదా కోసం నిర‌స‌న‌లు తెలుపుతున్నవారిని నిర్బంధిస్తున్నార‌ని, ప్రత్యేక హోదా విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments