Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. సృహ తప్పిన చదలవాడ అరవింద్ బాబు?

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (21:24 IST)
గుంటూరు జిల్లాలో వైఎస్సార్ విగ్రహం మాయం కావడానికి సంబంధించి ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ.. టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవింద్‌బాబు కూడా పాల్గొన్నారు. అయితే ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబు సృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది.
 
దీంతో గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో చదలవాడ అరవింద్‌బాబును నర్సరావుపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే అరవింద్‌బాబును ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్‌పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించగా, మరోసారి పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments