Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (16:45 IST)
కేంద్రం ముందుకొచ్చింది. ఇందులోభాగంగా, విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఈ ప్యాకేజీకి కేంద్రమంత్రివర్గం బేషరతుగా ఆమోదం తెలిపినట్టు మంత్రి వెల్లడించారు. నష్టాల ఊబిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆదుకోవాలని లేదా సెయిల్‌లో విలీనం చేయాలంటూ కార్మికులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయంతెల్సిందే. ఇందులోభాగంగానే ఈ ఫ్యాక్టరీని ఆదుకునేందుకు కేంద్ర ముందుకు వచ్చింది. 
 
కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. 
 
ఈ ప్రకటించిన ప్యాకేజీలో రివైవల్ ప్యాకేజీకి కింద రూ.10,300 కోట్లు కేటాయించారని, ఉక్కు పరిశ్రమ నష్టాలను అధికమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమ పూర్తిస్థాయిలో ఉత్పాదకతతో లాభాల బాటలో పయనించేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. నవ్యాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ ప్యాకేజీ నిదర్శనమని రామ్మోహన్ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments