Webdunia - Bharat's app for daily news and videos

Install App

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

ఠాగూర్
గురువారం, 24 ఏప్రియల్ 2025 (12:13 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా భావించే పహల్గామ్‌లోని పర్యాటక అందాలను తిలకిస్తున్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మరోవైపు, దేశంలో మరోమారు ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించారు. 
 
పహల్గామ్ ఉగ్రదాడి ఈ నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్‌లోని పలుచోట్ల ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు లగేజీని స్థానిక పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 
 
చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం! 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ నాగసాధును హైదరాబాద్ మోకిలా పోలీసులు మోసం కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అయితే, అఘోరీకి సంగారెడ్డి జిల్లా జైలు అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. న్యాయమూర్తి ఆదేశాలతో అఘోరీని సంగారెడడి జిల్లా కంది సబ్ జైలుకు పోలీసులు తరలించగా, ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్‌‌లోనూ ఉంచలేమని జైలు అధికారులు తేల్చి చెప్పారు. 
 
పైగా, అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌కు లింగ నిర్ధారణ జరిగితేగానీ ఇక్కడ ఉంచుకోలేమని అఘోరీని జైలు అధికారులు తిరిగి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు వైద్యులు వైద్య పరీక్షలు అనంతరం నింగ నిర్ధారణ చేయనున్నారు. అయితే, ట్రాన్స్ జెండర్లకు చంచల్ గూడా జైలులో ప్రత్యేక బ్యారక్ వసతి ఉండటంతో అధికారులు అక్కడకు తరలించారు. 
 
కాగా, ప్రత్యేక పూజల పేరుతో తన వద్ద రూ.9.80 లక్షలు వసూలు చేసి అఘోరీ మోసం చేసినట్టు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో ఉండే మహిళ ఫిబ్రవరి నెలలో మోకిలా పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే ఏపీకి చెందిన యువతి వర్షిణిని అఘోరి శ్రీనివాస్ పెళ్ళి చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అఘోరీని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత సాంకేతిక ఆధారాలతో అఘోరీని ఆచూకీని గుర్తించి, హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి అరెస్టు చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments