Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగుల‌కు తీపి క‌బురు... మూడు శాతం డి.ఎ. ప్రకటించిన కేంద్రం

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (15:44 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది మోడీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి డిఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) లను 3 శాతం పెంచడానికి ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
 
ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎను 17 శాతం నుండి 28 శాతానికి 11 శాతం పెంచిన కేంద్ర సర్కార్.. ఇవాళ మరో 3 శాతం డిఎను పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డిఎ 31 శాతానికి పెరుగుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌లో 3 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దసరా పండుగ మరియు దీపావళి పండుగ నేపథ్యంలో ఈ డి ఏ పెంపుపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డీఏ పెంపు నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments