Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు.. కోపంతో రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన కానిస్టేబుల్..

పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కోపంతో ఉన్నారు. అల్లర్లు జరుగవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో నగదు రాలేదన్న కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ రెండు

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (17:26 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కోపంతో ఉన్నారు. అల్లర్లు జరుగవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో నగదు రాలేదన్న కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం రాత్రి విశాఖ జిల్లా పాడేరులో చోటుచేసుకుంది. పాడేరులో ప్రజలు డబ్బులు తీసుకోవడానికి ఒకే స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎం మాత్రమే ఉంది. 
 
రాత్రి డబ్బులు తీసుకోవడానికి ఆ ఏటీఎం వద్దకు వచ్చిన కానిస్టేబుల్‌ కొద్దిసేపు వరుసలో నిలబడ్డాడు. అతని వంతు వచ్చే సరికి ఏటీఎమ్ మిషీన్ పనిచేయలేదు. దీంతో కానిస్టేబుల్‌కి పట్టలేని కోపం వచ్చింది.

అంతే కోపాన్ని ఏ మాత్రం ఆపుకోలేక ఏటీఎం మిషీన్‌ను నాలుగైదు సార్లు కాలితో తన్నాడు. అయినా కోపం ఏమాత్రం తగ్గకపోవడంతో మళ్లీ యంత్రాన్ని ధ్వంసం చేశాడు. దీంతో ఆ రెండు ఏటీఎంలూ ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పాడేరు బ్యాంకు సిబ్బంది ఏటీఎం కేంద్రానికి తాళం వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments