Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : వైకాపా ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటి వద్ద సీబీఐ సర్వే

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (09:05 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరుడు వరుసయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి ఇంటి వద్ద సీబీఐ అధికారులు సర్వే చేశారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు. 
 
అదేసమయంలో వివేకా పీఏ ఇనయతుల్లాను మంగళవారం రెండు విడతలుగా సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంటితో పాటు ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తదితరుల ఇళ్ళ వద్ద కూడా సర్వే నిర్వహించి వీడియోలు, ఫోటోలు చిత్రీకరించారు. 
 
ఇందుకోసం మంగళవారం ఉదయం 10.30 గంటలకు పులివెందులలోని ఆర్ అండ్ బి అతిథి గృహానికి ఇనయతుల్లాను సీబీఐ అధికారులు పిలిపించి విచారించారు. ఆ తర్వాత ఇనయతుల్లాతో పాటు ప్రభుత్వ సర్వేయరు, వీఆర్పో, ప్రైవేట్ ఫోటోగ్రాఫర్‌లను సీబీఐ అధికారులు వెంటబెట్టుకుని పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. 
 
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇంటి బయట సర్వే చేశారు. అలాగే, ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి బయట, ఈసీ గంగిరెడ్డి పాత ఆస్పత్రి వద్ద సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి  శంకర్ రెడ్డి, భరత్ యాదవ్, ఈసీ గంగిరెడ్డి, రంగన్న ఇళ్లు వైకాపా కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సర్వే నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments