Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తేలనున్న ఏపీ సీఎం జగన్ భవితవ్యం!!

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (07:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి భవితవ్యం నేడు తేలనుంది. ఆయన బెయిలు రద్దుకు సంబంధించి సీబీఐ కోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించనుంది. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనన్న అంశం రాజకీయ వర్గాలను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. 
 
సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేసి వారిపై నమోదైన కేసులను త్వరితగతిన విచారించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏప్రిల్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాలను జగన్ దుర్వినియోగం చేస్తూ బెయిలు షరతులను ఉల్లంఘిస్తున్నారని అందులో ఆరోపించారు. 
 
ముఖ్యంగా, వివిధ కారణాలు చూపుతూ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని రఘురామ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జులైలోనే వాదనలు పూర్తి కాగా తీర్పును సీబీఐ కోర్టు బుధవారానికి రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనన్న అటు వైసీపీ నేతల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments